World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Date:

Share post:

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా నివేదికలో భారత్ స్థానం (India Happiness Rank 2026) మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ నివేదికను United Nations అనుబంధ సంస్థలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తాయి.

♦ భారత్ ఏ స్థానంలో ఉంది? (India Happiness Rank 2026):

UN తాజా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచ సంతోష సూచికలో భారత్ 116వ ర్యాంక్ లో ఉంది. అయతే గత సంవత్సరాలతో పోలిస్తే కొంత మెరుగుదల ఉన్నప్పటికీ, ఇంకా టాప్ దేశాలకు చాలా దూరంలో ఉంది. 2024లో భారత్ ర్యాంక్ 126కి ఉండగా… 2024లో 118 వ స్థానంలో, 2026లో 116 వ స్థానంలో నిలిచింది.

నివేదికల ప్రకారం వృద్ధుల్లో జీవిత సంతృప్తి పెరగడం, అలాగే కుటుంబ బంధాలు బలంగా మారడమే భారత్ స్కోర్ మెరుగవడానికి కరనమినట్లుగా తెలుస్తోంది.

♦ హ్యాపీగా ఉన్న టాప్ దేశాలు : (List of Happiest Countries in the World)

UN రిపోర్ట్ ఆధారంగా… సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, ఐస్లాండ్ రెండో స్థానం అలాగే డెమార్క్ మూడో స్థానం లో ఉన్నాయి. అంతేకాకుండా టాప్ 10 జాబితాలో యూరోపియన్ దేశాలే ఎక్కువగా ఉండడం గమనార్హం.

World Happiness Report లో దేశాల సంతోష స్థాయిని కొలవడానికి కొన్ని కీలక Key Factors కారకాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇవే ప్రధానంగా ప్రతి దేశ ర్యాంక్‌ను నిర్ణయిస్తాయి.

వీటిలో భాగంగా… సామాజిక మద్దతు (Social Support), వ్యక్తి తలసరి ఆదాయం (GDP), ఆరోగ్య జీవన కాలం (Healthy Life Expectancy), జీవన నిర్ణయాల్లో స్వేచ్ఛ (Freedom to Make Life Choices), దాతృత్వం (Generosity) మరియు అవినీతిపై అవగాహన (Perception of Corruption): ఆరు ముఖ్య కారకాల ఆధారంగా చేసుకుని ఒక దేశం ఎంత సంతోషంగా ఉందో ఈ నివేదిక అంచనా వేస్తుంది.

ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report):

ALSO READ: Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles