సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇంస్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (Instagram End to End Encryption) ఫీచర్ ను ఇకనుంచి నిలిపివేస్తున్నట్లు మెటా కీలక నిర్ణయం తీసుకుంది.
మీడియా సమాచారం ప్రకారం… ఇంస్టాగ్రామ్ తమ డైరెక్ట్ మెసేజ్ లలో (DMs) ఉపయోగించే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (Instagram End to End Encryption – E2EE) ఇకపై అందుబాటులో ఉండదని ప్రకటించింది. ఆ ఫీచర్ ఉపయోగించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో మెటా ఆ ఫీచర్ ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎండ్ తో ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ( End to End Encryption)
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే మెసేజ్ పంపిన వ్యక్తి మరియు ఆ మెసేజ్ ను అందుకున్న వ్యక్తి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ని చదవగలగడం. ఈ ఎండ్ తో ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం వల్ల ఆ మెసేజ్ ని ఇంకెవరు (థర్డ్ పార్టీ or కంపెనీ) కూడా దానిని చూడలేరు అలాగే చదవలేదు.
ఇస్టాగ్రమ్ లో ఈ ఫీచర్ గతంతో కొన్ని చాట్ లకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ని ఉపయోగించే వారి సంఖ్య తక్కువ ఉండడంతో మెటా ఆ ఫీచర్ ను తొలగించాలి అనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఏం మారబోతోంది?
ఇకపై ఇంస్టాగ్రాంలో డైరెక్ట్ మెసేజ్ లు మెటా సర్వర్ ల ద్వారా ప్రాసెసింగ్ అవుతాయి. అలాగే పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయ్యే విధానం ఉండదు. అయితే మెటా చెందిన వాట్సాప్ లో (Whatsapp) మాత్రం ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ యధావిధిగా కొనసాగుతుంది అని స్పష్టం చేసింది.
మెటా తీసుకున్న ఈ నిర్ణయం పై సోషల్ మీడియాలో మిశ్రమ అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే మెటా చెప్తున్నా సమాచారం ప్రకారం… ఇంస్టాగ్రామ్ అనేది ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావడంతో, మెసేజ్ భద్రతకు సంబందించిన సేవలను ఇతర యాప్స్ లో అందాచాలనే ఆదేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (E2EE) ఫీచర్ నిలిపివేత (Instagram to disable End to End Encryption):
🛡️ Meta to Permanently Remove End-to-End Encryption Feature in Instagram DMs
Source: https://t.co/sByMw4LT1L
Meta has confirmed it will permanently remove end-to-end encryption (E2EE) support from Instagram direct messages, with the feature officially shutting down after May… pic.twitter.com/dotQ31qKa9
— Cyber Security News (@The_Cyber_News) March 15, 2026
🚨Meta has confirmed it will remove support for end-to-end encryption on Instagram direct messages starting May 8, 2026. pic.twitter.com/rv0JzD7UXw
— Indian Infra Report (@Indianinfoguide) March 14, 2026
ALSO READ: Google Maps కొత్త అప్డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు




