ఢిల్లీలో జరుగుతున్న India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగిపోతుంది. వాస్తవానికి ఆ వార్త ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందే అవకాశముంది. అసలు విషయం ఏంటంటే, చైనీస్ కంపెనీ Unitree Romotics కు చెందిన robot dog ని యూనివర్సిటీ స్టాల్ లో ప్రదర్శించి, అది తామే తయారీ చేశామని యూనివరిస్టీ ప్రొఫెసర్ నేహా సింగ్ చెప్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన జనాలు, ఇది చైనీస్ యూనిట్రీ రోబో అని గుర్తించడం తో ఈ విషయం మొత్తం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే… భారత ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 20 వ తేదీ వరకు న్యూ ఢిల్లీలో నిర్వహిస్తున్న India AI Impact Summit లో ఉత్తరప్రదేశ్ కి చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ కూడా తమ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి స్టాల్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ స్టాల్ ని సందర్శించిన దూరదర్శన్ రిపోర్టర్ తో, అక్కడే ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ ఓ రోబో డాగ్ ని చూపిస్తూ, దీని పేరు ఓరియాన్, దీన్ని మా యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ డెవలప్ చేసింది, మేము ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కోసం రూ. 350 కోట్లు ఇన్వెస్ట్ చేసిన మొట్ట మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ అంటూ చెప్పారు. ఆ వీడియో వైరల్ అవ్వడం తో నెటిజన్స్ ఆ రోబో డాగ్ చైనీస్ కంపెనీ అయిన యూనిట్రీ డెవలప్ చేసింది అని చెప్తూ దాని ప్రైస్ తో ( Unitree Go2 Price ) సహా స్క్రీన్ షాట్ పెట్టి అసలు నిజాన్ని బయటపెట్టారు.
దీనికి సంబంధించిన వార్త నిర్వాహకులకు తెలియడంతో, యూనివర్సిటీ కి చెందిన స్టాల్ కి ఎలక్ట్రిసిటీ సప్లై కూడా ఆపేసి, వెంటనే ఖాళీ చెయ్యమని ఆదేశించినట్లు తెలుస్తోంది.
డామేజ్ కంట్రోల్ Galgotias University Robot
ఇదంతా జరిగిన తర్వాత Galgotias University కి చెందిన ఇంకో ప్రొఫెసర్ మరియు ఈ రోబో ఆవిష్కరణ మేమే చేశామని రిపోర్టర్ తో మాట్లాడిన ప్రొఫెసర్ నేహా సింగ్ వేర్వేరుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తమ తప్పుని కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారి క్లెయిమ్ కి సంబంధించిన వార్త వైరల్ అవ్వడం తో యూనివర్సిటీ మరియు సదరు ప్రొఫెసర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది.



