తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం చేసుకోవాలి అని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ నెల 18న కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meeting) నిర్వహించి, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. అలాగే నిరుద్యోగుల బదిలీలను కూడా పూర్తి చేయాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
జూన్ 2 తర్వాత ఏపీ భవనాలు స్వాధీనం (Telangana Cabinet Meeting):
జూన్ 2 తర్వాత ఏపీ భవనాలు స్వాధీనం#TelanganaCabinet #CMRevanthreddy #NTVNews #NTVTelugu pic.twitter.com/iyLHyKRrbv
— NTV Telugu (@NtvTeluguLive) May 16, 2024
ALSO READ: సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని