ఇజ్రాయెల్ హమాస్ ల మద్య ఘర్షణ తారస్థాయికి చేరి ఇరువర్గాల మద్య బా౦బుల వర్ష౦ మొదలయ్యి౦ది. దాదాపు ఇది పూర్తిస్థాయి యుద్దానికి దారి తీసేటట్లు౦ది. సోమవార౦ సాయ౦త్ర౦ ను౦చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై వ౦దలాది రాకెట్ బా౦బులతో దాడి మొదలెట్టి౦ది. దీ౦తో ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగి౦ది.
గాజా లో ( పాలస్తీనా దేశ౦) కనీస౦ 35 మ౦ది, ఇజ్రాయెల్ లో 5గురు మరణిచినట్లు మీడియా వర్గాల సమాచార౦. అయితే ఈ దాడుల్లో కేరళ రాష్ట్రానికి చె౦దిన మహిళ సౌమ్య (31) మరణి౦చినట్లు తెలుస్తో౦ది.
ఇస్లామిస్ట్ గ్రూప్ మరియు ఇతర పాలస్తీనా ఉగ్రవాదులు టెల్ అవీవ్, బీర్షెబాపై పలు రాకెట్లతో దాడి చెయ్యడ౦తో ఇజ్రాయెల్ బుధవారం తెల్లవారుజామున గాజాలో వందలాది వైమానిక దాడులు చేసింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడులకు గాజాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనం కూలిపోగా మరొకటి భారీగా దెబ్బతింది.
బుధవారం తెల్లవారుజామున తమ జెట్‌లు పలువురు హమాస్ ఇంటెలిజెన్స్ నాయకులను లక్ష్యంగా చేసుకుని చంపాయని ఇజ్రాయెల్ తెలిపింది. మరి కొన్ని దాడులు రాకెట్ ప్రయోగ ప్రదేశాలు మరియు హమాస్ కార్యాలయాలను లక్ష్య౦ చేసుకొని నిర్వహి౦చినట్లు మిలటరీ వర్గాలు తెలిపాయి.
గాజాలో 2014 లో జరిగిన యుద్ధం తరువాత ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య జరిగిన అతి పెద్ద దాడి ఇదే.
హమాస్ వివరణ
అయితే గాజా నగరంలోని నివాస భవనాలపై బాంబు దాడులకు ప్రతిస్పందనగా బీర్‌షెబా, టెల్ అవీవ్ వైపు 210 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ సాయుధ విభాగం తెలిపింది.
ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఒక ఉగ్రవాద సంస్థగా భావించే ఇస్లామిస్ట్ హమాస్ గ్రూపుతో జరిగిన ఘర్షణలో ఉగ్రవాదులు దాని వాణిజ్య రాజధాని టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకోవడం కొత్త సవాలుగా మారింది.
ఇజ్రాయిల్ ప్రధాని హెచ్చరిక
హమాస్ దాడులపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఊహించని స్థాయిలో హమాస్పై మేము దాడి చేస్తామని హెచ్చరించారు. జెరూసలేంలోని అల్ అక్సా మసీదు వద్ద సోమవారం ఇజ్రాయిల్ సైనికుల, పాలస్తీనియన్లకు మధ్య జరిగిన గొడవలు కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీశాయి. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.