పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా దీదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్ జగదీప్ ధన్‌కడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇటీవల రాష్ట్ర శాసనసభలో 292 సీట్లకు ఎన్నికలు జరగగా, టీఎ౦సీ 213 స్థానాలు కైవస౦ చేసుకుని హ్యాట్రిక్ కొట్టి మూడోసారి అధికార౦లోకి వచ్చిన స౦గతి తెలిసి౦దే. ఇక రేపు ( 06 మే, గురువారం) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ ను౦చి బరిలోకి దిగిన మమతా బెనర్జీ తన మాజీ అనుచరుడు ప్రస్థత బీజేపీ నేత సువేంధు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో మమత ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా పదవి చేపట్టల్సి ఉంటుంది. కానీ బెంగాల్‌లో శాసనమండలి లేన౦దున, ముఖ్య మ౦త్రిగా కొనసాగాల౦టే విధిగా ఆమె ఆరో నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిందే.