Boycott Maldives: ఎందుకు బాయ్ కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ అవుతోంది?

Date:

Share post:

బాయ్ కాట్ మాల్దీవ్స్ ప్రస్తుతం ఈ హ్యాష్ టాగ్ మొత్తం సోషల్ మీడియా ని (Boycott Maldives) కుదిపిస్తోంది. అసలు ఇంతకీ ఈ హ్యాష్ టాగ్ ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏమిటి? ( Why Boycott Maldives Trending?)

రెండు రోజులుగా బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ టాగ్ ఒక్క ట్విట్టర్ లోనే కాకుండా సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఇంతేకాకుండా కొంతమంది సెలెబ్రెటీలు సైతం మాల్దీవ్స్ ను సందర్శించడం మానేయని అని పిలుపునిస్తున్నారు.

ఎప్పుడు సందర్శకులతో కిటకిటలాడే టూరిస్ట్ ప్రదేశం మాల్దీవ్స్. ఇందులో భారత్ నుంచి మాల్దీవ్స్ భారీగా పర్యటకులు వెళ్తుంటారు… ఏటా సుమారు రెండు లక్షల మంది భారత్ నుంచి మాల్దీవ్స్ కు వెళ్తున్నట్లు తెల్సుతోంది. అయితే ప్రతుతం అక్కడికి బుక్ చేసుకున్న టికెట్ల అన్నీ రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం.

మోదీ ట్వీట్:

భారత ప్రధాని నరేంద్ర మోదీ గతవారం లక్షద్వీపులో పర్యటించిన విషయం తెలిసినదే. అయితే పర్యతనలో భాగంగా అక్కడి ఫొటోలు, వీడియోలను ఎక్స్ ( ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో భాగంగా సాహసాలు చేయాలి అనుకునే వారు లక్షద్వీపులో పర్యటించాలి అంటూ చెప్పుకొచ్చారు (PM Narendra Modi Lakshadweep tweet).

కాగా ఈ పోస్ట్లు చుసిన చాలా మంది లక్షద్వీపు గురించి గూగుల్ లో సెర్చ్ చేసినట్లు సమాచారం. దీంతో చాలా మంది పర్యాటకులు లక్షద్వీపు ప్రదేశానికి వెళ్తారని భావించిన మల్దీవ్ మంత్రులు భారత్ పై అనుచిత వ్యాఖ్యాలు చేశారు.

మాల్దీస్ మంత్రులు ఎం అన్నారు?

లక్షద్వీప్‌‌ను మోదీ ప్రమోట్ చేయడం వల్ల మాల్దీవులుపై పెద్ద దెబ్బ పడుతుందని వారు చెప్పుకొచ్చారు. ఇంతేకాకుండా… మాతో పోటీ పడాలనే ఆలోచన కేవలం భ్రమ మాత్రమే అని అన్నారు. మేం అందించే సేవలను వారు ఎలా అందించగలరు? ఇంత శుభ్రంగా ఎలా ఉంచగలరు? అందులోను అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్ ను చుసిన చాలామంది భారతీయులు తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌‌ (ట్విట్టర్‌‌‌‌) వేదికగా ‘బాయ్‌‌కాట్ మాల్దీవ్స్’ హ్యాష్‌‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ను సపోర్ట్ చేస్తూ పలువురు సినీ మరియు స్పోర్ట్స్ ప్రముఖులు కూడా ట్వీట్ చేశారు.

మరికొందరు భారతీయులు… తాము మాల్దీవ్స్ కు బుక్ చేసుకున్న టికెట్ లను రద్దు చేసుకుంటూ వాటి స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 వేల హోటల్ బుకింగ్స్, 2500 ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయినట్లు మీడియా సమాచారం.

సోషల్ మీడియా లో ఈ వివాదం వేడెక్కుతుండడంతో ఈ దేశ ప్రభుత్వం ఈ విషయం పట్ల స్పందించింది. భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ మంత్రులను ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

ALSO READ: హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేసు రద్దు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles