Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం 7 గంటలు నించి పోలింగ్ కొనసాగుతోంది. అయితే రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఒక్క స్థానంలో (కరణ్ పూర్ నియోజకవర్గం) మాత్రం పోలింగ్ జరగడం లేదు అని గమనించాలి. కరణ్ పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నూర్ మరణించడం తో ఆ స్థానంలో పోలింగ్ నిలిపివేయడం జరిగినట్లు సమాచారం.
పోలింగ్ కేంద్రాలు కొంతమంది ప్రముఖుకులు తమ ఓటు హక్కును వినియోగించుకునట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్… సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
అయితే ఈ ఎన్నికలలో విజయం కోసం అధికార కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు పోటాపోటీ గా పనిచేసాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తుండగా… బీజేపీ ఈసారి ఎలాగైనా రాజస్థాన్ ఎన్నికల్లో విజయం సాధించి, డబల్ ఇంజిన్ సర్కార్ ను తీస్కుని రావాలని చూస్తోంది.
మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందో తెలియాలి అంటే డిసెంబర్ 3 న ఫలితాలు వెల్లడించే వరకు వేచి ఉండాల్సిందే.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan Elections 2023):
#WATCH | Rajasthan Elections | Voters queue up at a polling station in Kota South Assembly constituency; voting for the state assembly election began at 7 am. pic.twitter.com/1aCi4iBnx5
— ANI (@ANI) November 25, 2023
After casting his vote in Sardarpura, Rajasthan CM Ashok Gehlot says, "Congress will repeat government in Rajasthan…After today, they(BJP) will not be visible."#RajasthanElection2023 #AshokGehlot@ashokgehlot51 pic.twitter.com/EBGZ50mwdE
— editorji (@editorji) November 25, 2023
సర్దార్‌పురాలో ఓటు వేసిన అనంతరం, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మల్లి అధికారం లోకి వస్తుంది.. ఈ రోజు తర్వాత, వారు (బీజేపీ) కనిపించరు” అని చెప్పారు.
ALSO READ: ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్