KA Paul Comments on Manda Krishna Madiga: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో పోటీచేసుందుకుగాను తమ పార్టీకి ఎలక్షన్ సింబల్ ఇవ్వలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇందుకు గాను తాను హైకోర్టు కు వెళ్తానని అన్నారు.
ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో కేఏ పాల్ మాట్లాడుతూ… రాష్ట్రలో ఉన్న కుటుంబపాలను ఇక చరమగీత పడాలన్నారు.
అంతేకాదు ‘మా పార్టీలో చేరమని మందకృష్ణ మాదిగను అడిగామని… అందుకుగాను అయన 25 కోట్లు అడిగారని, అయితే ప్రస్తుతం ఆయన ప్రధాని నరేంద్రమోడీ కు అమ్ముడుపోయాడని’ పాల్ ఆరోపించినట్లు తెలుస్తోంది.
ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గిరిజన మాదిగల సభలో మందకృష్ణకు 75 కోట్లు ముట్టాయని..అంతేకాకుండా ఎంపీ పదవి ఇస్తారన్న ఆశతోనే ఆయన అమ్ముడుపోయారని పాల్ విమర్శించారు.
పోటీ చేయని వైఎస్సార్టీపీ కి కూడా సింబల్ వచ్చింది
అంతేకాకుండా ఎన్నికలో పోటీ చేయని వైఎస్సార్టీపీ కి కూడా సింబల్ వచ్చింది… కానీ ప్రజాశాంతి పార్టీకి ఎందుకు సింబల్ ఇవ్వలేదు..? అని పాల్ ప్రశ్నించారు.
పోటీ చేయని YSRTP కి కూడా సింబల్ వచ్చింది..ప్రజాశాంతి పార్టీకి ఎందుకు ఇవ్వలేదు..? – KA Paul#KAPaul #PrajashanthiParty #YSRTP #TelanganaElection2023 #NTVNews #NTVTelugu pic.twitter.com/PtVb247Ujy
— NTV Telugu (@NtvTeluguLive) November 10, 2023
ఏ పార్టీ కి ఓటు వేయకండి
“తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లందరు శాపగ్రస్థులు అయిపోతారు… అందుకే ఏ పార్టీ కి ఓటు వేయకండి లేదా నోటా కి వెయ్యండి అని పాల్ తెలిపారు.
మందకృష్ణ మాదిగ మోడీకి అమ్ముడు పోయాడు..నా పార్టీలో చెరమంటే 25కోట్లు అడిగారు.. – KA పాల్#KAPaul #MandaKrishnaMadiga #NarendraModi #Telangana #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #PrajaShantiParty #BJP #NTVTelugu pic.twitter.com/WY5yFpkfwL
— NTV Telugu (@NtvTeluguLive) November 13, 2023
ALSO READ: బీజేపీ కు షాక్… తుల ఉమ రాజీనామా