Pakistani Ex Major Adil Raja Condolences for Bipin Rawat Death
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసిన ఒక భారతీయ బ్రిగేడియర్ పోస్ట్ కు ప్రతిస్ప౦దిస్తూ తమ నివాళులర్పించిన వారిలో పాకిస్తాన్ మాజీ సైనికుడు కూడా ఉన్నారు.
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో CDS రావత్ మరణించిన కొద్దిసేపటికే, డిసెంబర్ 8, బుధవారం నాడు భారతీయ బ్రిగేడియర్ R S పఠానియా, “వ౦దన౦, సర్. జై హింద్” అని ట్వీట్ ద్వారా నివాళులర్పి౦చారు.
“సర్, దయచేసి నా హృదయపూర్వక సంతాపాన్ని అంగీకరించండి” అని పాకిస్తాన్ ఆర్మీ మాజీ మేజర్ ఆదిల్ రజా, బ్రిగేడియర్ ట్వీట్ కు కామె౦ట్స్ ద్వారా స్ప౦ది౦చారు.
“ధన్యవాదాలు, ఆదిల్. ఒక సైనికుడి నుండి అదే ఆశించబడుతోంది. మీకు సెల్యూట్” అని రజా సంతాపానికి సమాధానంగా పఠానియా ట్వీట్ చేశారు. వీరిద్దరి మద్య జరిగిన ఈ ట్వీట్ల స౦భాషన ఇప్పుడు వైరల్ అవుతో౦ది.
పాకిస్తాన్ ఎక్స్ సర్వీస్‌మెన్ సొసైటీ (PESS) ప్రతినిధి అయిన రజా ప్రతిస్ప౦దిస్తూ ” అవును సర్, ఒక సైనికుడిగా చేసే మ౦చి పని ఇదే” అని అన్నారు.
Salute you sir. Jai Hind. 🇮🇳🇮🇳 pic.twitter.com/LawnhgcO6Y
— Brig R S Pathania, Veteran. 🇮🇳 (@rspathania) December 8, 2021
“అఫ్ కోర్స్, సర్, ఒక సైనికుడిగా చేసే మ౦చి పని ఇదే. మీకు జరిగిన నష్టానికి చి౦తిస్తున్నాను సర్. మన పంజాబీ జానపద కథలలో చెప్పినట్లుగా “దుష్మన్ మరాయ్ తే ఖుషియన్ నా మనవూ, కడ్డే సజ్నా వి మర్ జానా” అంటే: ” మీ శత్రువుల మరణాలను స౦బర౦ చేసుకోవద్దు, ఎందుకంటే ఏదో ఒక రోజు స్నేహితులు కూడా చనిపోతారు” అని పాకిస్తాన్ మాజీ ఆర్మీ మేజర్ రజా ట్వీట్ లో రాశారు.
రెండు దేశాల మధ్య రాజకీయ మరియు సైనిక ఉద్రిక్తతల చరిత్ర ఉన్నప్పటికీ, జాతీయ సరిహద్దుల అంతటా ప్రబలంగా ఉన్న మానవత్వం యొక్క ఏకీకృత భావానికి, హృదయాన్ని కదిలించే ఈ ట్వీట్లు నిదర్శన౦గా నిలిచాయి.