నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఇస్లామిక్ వేడుకలో తన బాగస్వామి అస్సర్ మాలిక్ తో నిఖా చేసుకున్నారు.
24 ఏళ్ల కార్యకర్త తన జీవితంలో ఇది “అమూల్యమైన రోజు” అని అన్నారు.
ఈ పాకిస్థానీ మహిళా హక్కుల కార్యకర్తను 2012లో తాలిబన్లు తలపై కాల్చిన స౦గతి తెలిసి౦దే. ఆ తర్వాత ఆమె వెస్ట్ మిడ్లాండ్స్లో ఆశ్రయం పొందారు.
“అస్సర్ మరియు నేను జీవిత భాగస్వాములుగా ఉండటానికి సమ్మతి౦చుకొని ముడి పడ్డాము” అని ఆమె మంగళవారం ట్వీట్ చేస్తూ… వారు కుటుంబంతో నిక్కా వేడుక లో ఎలా పాల్గొన్నారో పంచుకున్నారు.
Today marks a precious day in my life.
Asser and I tied the knot to be partners for life. We celebrated a small nikkah ceremony at home in Birmingham with our families. Please send us your prayers. We are excited to walk together for the journey ahead.
📸: @malinfezehai pic.twitter.com/SNRgm3ufWP— Malala (@Malala) November 9, 2021
మలాలా 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, బాలికల విద్యాహక్కు కోసం మాట్లాడినందుకు పాకిస్థాన్‌లోని తాలిబాన్లు ఆమెను టార్గెట్ చేశారు.
వాయువ్య స్వాత్ లోయలో ఒక ఉగ్రవాది ఆమె ప్రయాణిస్తున్న స్కూల్ బస్సులోకి ఎక్కి కాల్పులు జరిపిన దాడిలో ఆమె ప్రాణాలతో బయటపడింది, ఆమెతో పాటు తన ఇద్దరు స్నేహితులు కూడా గాయపడ్డారు.
ఆమె ప్రాణాంతక గాయాల నుండి కోలుకున్న తర్వాత, ఆమె తన కుటుంబంతో కలిసి బర్మింగ్‌హామ్‌కు మకాం మార్చారు, అప్పటిను౦చి ఆమె దానిని “రెండవ ఇల్లు” గా భావిస్తున్నారు.
17 సంవత్సరాల వయస్సులో, ఆమె నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టి౦చారు. ఆమె ఉన్నత విద్యాభ్యాస౦ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో జరిగి౦ది.
గ్రాడ్యుయేట్ అయినప్పటి నుండి, మలాలా ఆఫ్ఘన్ శరణార్థులకు మెరుగైన మద్దతు కోసం పాటుపడుతూ, డాక్యుమెంటరీలను రూపొందించడానికి Apple TV+తో ఒప్పందం కూడా చేసుకున్నారు.
చట్టబద్ధమైన ఒప్పందం కానప్పటికీ, నిఖా వేడుక ఇస్లామిక్ వివాహంలో మొదటి అడుగు అని బీబీసీ తన నివేదికలో తెలిపి౦ది.
మలాలా నిఖా వేడుక వార్తలను ఆన్లైన్లో చూసిన వేలాదిమ౦ది అభిమానులు లైకులు, కామె౦ట్లు చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.