Emergency Alert on Phones: దేశవ్యాప్తంగా గురువారం కొంతమంది మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. అయితే ఈ అలర్ట్ మెసేజ్ చూసి చాలామంది ప్రజలు దీనిని ఎవరు పంపారో? ఎందుకు పంపారో తెలియక ఆందోళనకు గురైనట్లు సమాచారం.
ఇక విషయానికొస్తే… ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిసింది. రాబోయే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి ప్రజలను ఒకేసారి అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం వినూత్న పద్ధతిలో మొబైల్ ఫోన్లలో కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షిస్తోంది. ఈ టెస్టింగ్ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి చాల మందికి ఈ మెసేజ్ ను పంపడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనుబంధంతోనే ఈ టెస్టింగ్ జరిగింది. విషయం తెలుస్తుకున్న నెటిజన్లు ఈ వార్తని సోషల్ మీడియా మొత్తం వైరల్ చేశారు.
భూకంపాలు సంభవించినప్పుడు అలాగే ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, సునామీలు, ఇతర విపత్తులేమైనా వచ్చినప్పుడు ప్రజలను తక్షణమే అలర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ను పట్టించుకోవద్దని… మీ నుంచి ఎలాంటి స్పందన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ మెసేజ్ మొదట ఇంగ్లిష్ భాషలో అలర్ట్ రాగా, తరువాత తెలుగు, హిందీ భాషల్లో కూడా సందేశాన్ని పంపించారు. అయితే ఎలాంటి అలర్ట్ మెసేజ్‌లు జులై 20, ఆగస్టు 17 తేదీల్లో కూడా కొన్ని వచ్చాయని కొంతమంది పేర్కొంటున్నారు.
విపత్తుల గురించి ప్రజలను హెచ్చరించేందుకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను అమలులో ఉన్నాయి. అయితే ఇప్పుడు భారత్ కూడా అలాంటి వ్యవస్థనే అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఇంతకీ ఈ ఎమర్జెన్సీ అలెర్ట్ లో ఏముంది?
‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన శాంపిల్ టెస్ట్ మెసేజ్. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ నుంచి పంపించబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది’ అని మెసేజ్ లో ఉంది.
ఎమర్జెన్సీ అలెర్ట్ (Emergency Alert on Phones):
National Emergency Alert: testing services 👍👍
Proper purpose kosam use chesthe baguntundi further.. me political agenda kosam kakunda😊 pic.twitter.com/D5UVpovC3z
— Mohan Kumar (@ursmohan_kumar) September 21, 2023
ALSO READ: ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం