Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

Date:

Share post:

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు (Two Basara IIIT Students held for Consuming Ganja). విషయం అందుకున్న పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఐటీ క్యాంపస్ లో గంజాయి పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త కలకలం రేపుతోంది.

మీడియా కధనం ప్రకారం… నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్‌లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో బాయ్స్ హాస్టల్ లో సోదా నిర్వహించగా.. బిల్డింగ్ పైన దాచిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయని సమాచారం.

క్యాంపస్ లోకి గంజాయి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీయగా.. మహారాష్ట్ర నుంచి విద్యార్థులు ప్యాకెట్ల రూపంలో తీసుకొచ్చినట్లు తేలిందని చెప్పారు.

గంజాయి కలకలం (Basara IIIT Students held for Consuming Ganja):

ALSO READ: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

Newsletter Signup

Related articles