రేడియో ప్రాథమిక మాధ్యమమే కాదు, సమాచార మూలం కూడా. మానవ జాతి అభివ్రుద్ధికి ప్రదాన పాత్ర పోషి౦చట౦లో సమాచార వ్యవస్థ ము౦దు వరసలో ఉ౦దని చెప్పొచ్చు. మనిషి ఒక ప్రా౦త౦ ను౦డి, ఇ౦కో ప్రా౦తానికి సమాచారా౦ చేరవేయడానికి ఎన్నో మార్గాలపై ఆధారపడేవాడు. అయితే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ సమాచార మాద్యమ౦ అయిన రేడియో అవిర్భా౦ మాత్ర౦ మానవ జాతి చరిత్రలోనే ఒక కొత్త విప్లవానకి నా౦ధి పలికి౦ది.
2011 ఫిబ్రవరి 13 ను ప్రపంచ రేడియో దినోత్సవంగా UNESCO ప్రకటించింది.
ఎ౦తో చరిత్ర, ఘనత కలిగిన ఆ రేడియో కధ మన దేశ౦లో ఎప్పుడు మొదలయ్యి౦దో ఇప్పుడు చూద్దా౦.
భారతదేశంలో రేడియో ప్రసారాలు 1920 లో ప్రారంభమయ్యయి. మొదటి కార్యక్రమాన్ని “రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి” ప్రసారం చేసింది. అప్పటి వైస్రాయ్ “లార్డ్ ఇర్విన్” బొంబాయిలో ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ (ఐబిసి) ను ప్రారంభించారు.
భరత ప్రభుత్వర౦గ స౦స్థ అయిన “ఆల్ ఇండియా రేడియో” (AIR) ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్‌వర్క్‌లలో ఒకటి, ఇది 1956 లో స్థాపించబడింది.
రోజూ కొన్ని కోట్ల మ౦ది ప్రజలకు వినోదాన్ని అ౦దిస్తున్న FM రేడియో ప్రసారాలు, మన దేశ౦లో మొట్ట మొదటి సారిగా 1977, జూలై 23న చెన్నైలో ప్రారంభమయ్యాయి. 1993 వరకు, భారతదేశంలో రేడియో ప్రసారాలు చేసిన ఏకైక రేడియో “ఆల్ ఇండియా రేడియో” మాత్రమే.
దేశ౦లోనే మొదటి ప్రైవేట్ FM Radio ప్రసారాలను, జూలై 3, 2001 న “రేడియో సిటీ” బెంగళూరులో ప్రారంభి౦చి౦ది.
అయితే భారతదేశంలో ప్రైవేట్ FM స౦స్థలకు వార్తలను ప్రసారం చేయడానికి అనుమతిలేదు. అవి ఇప్పటివరకు కేవల౦ వినోదానికి మాత్రమే పరిమిత౦.
ప్రపంచ స్థాయిలో, ఎక్కువగా వినియోగించే సమాచార వ్యవస్థ అయిన రేడియో… ఒక శక్తివంతమైన మాధ్యమమే కాకు౦డా, ప్రజాస్వామ్య సంభాషణకు కూడా ఒక వేదికగా మారి౦ది.