New Banking Rules: కే౦ద్ర ప్రభుత్వ౦ 8 ప్రభుత్వ ర౦గ బ్యా౦కులను విలీనం చేసిన నేపద్య౦లో, విలీన౦ చేయబడిన బ్యాంకుల వినియోగదారుల పాత ఖాతా పుస్తకాలు, చెక్కులు ఏప్రిల్ 1, 2021 ను౦చి చెల్లవని గమనించాలి.
విలీన౦ చేయబడిన ఈ ఎనిమిది బ్యాంకులు – విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ మరియు దేనా బ్యాంక్. ఈ ఎనిమిది బ్యాంకుల ఖాతాదారులు కొత్త చెక్ బుక్ మరియు పాస్ బుక్కులు స౦బ౦దిత బ్రా౦చి ను౦చి పొ౦దవలసి ఉ౦టు౦ది.
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబిసి) యొక్క ప్రస్తుత చెక్ పుస్తకాలు 2021 ఏప్రిల్ 1 న౦చి చెల్లవని పంజాబ్ నేషనల్ నేషనల్ (పిఎన్బి) వినియోగదారులకు తెలియజేసింది.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తమ పాస్ బుక్‌లు, చెక్‌బుక్కులతో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC), ఎంఐసీఆర్ (MICR Code) కోడ్ వంటివి కూడా మారతాయి.
సిండికేట్ బ్యాంక్ ఖాతాదారుల ప్రస్తుత చెక్ బుక్స్ మాత్ర౦ 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని బ్యాంకు ప్రకటించింది.
ఈ ఎనిమిది బ్యాంకుల ఖాతాదారులు మొబైల్ నంబర్, చిరునామా, నామినీ పేరు మొదలైన వారి ఖాతా వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోవాలి. కస్టమర్ వారి మాజీ బ్యాంకులు విలీనం అయిన బ్యాంక్ నుండి కొత్త చెక్ బుక్ మరియు పాస్‌బుక్‌ను పొందాలి. కొత్త చెక్ బుక్ మరియు పాసు బుక్కు పొందిన తరువాత, ఖాతాదారులు తమ బ్యాంకింగ్ వివరాలను అప్ డేట్ చేసుకోవలసి ఉ౦టు౦ది.
విలీనమయిన బ్యా౦కుల వివరాలు:
ఏప్రిల్ 1, 2019 న, దేనా బ్యాంక్ మరియు విజయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబిసి) మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎన్‌బితో కలపడం ఏప్రిల్ 1, 2020 న పూర్తయింది. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ విలీనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంకులో విలీనం అయ్యింది.
ఈ విలీనాలను ప్రభుత్వం ఆగస్టు 2019 లో ప్రకటించింది.
పన్నుల విషయ౦లో మార్పులు:
ఏప్రిల్ 1, 2021 తర్వాత 75 ఏళ్ల వయసు పైబడిన వారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ ద్వారా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్న వారికి ఇది వర్తిస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్లు కూడా పెరగనున్నాయి.