Meta Verified Subscription: మరికొద్ది రోజుల్లో Facebook Blue Badge అందరికి అందుబాటులోకి రాబోతుంది. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ (Paid) రాకముందు ఈ వెరిఫీడ్ బ్యాడ్జి ను చాలామంది స్టేటస్ సింబల్ గా భావించేవాళ్లు. కానీ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఎప్పుడైతే దీన్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్ గా మార్చారో, అప్పటినుంచి సదరు సోషల్ మీడియా వినియోగదారుల్లో బ్లూ వెరిఫీడ్ బ్యాడ్జి ఉన్నా లేకపోయినా ఒకటే అనే భావం కలిగింది.
ఇక అసలు విషయానికి వస్తే… ట్విట్టర్ లో మాదిరిగానే ఫేస్బుక్ కూడా బ్లూ వెరిఫీడ్ బ్యాడ్జిని పెయిడ్ సబ్స్క్రిప్షన్ ( Meta Verified Subscription) గా మార్చేయబోతుంది. కొన్ని గంటల క్రితం దీనికి సంబంచిన వార్తను మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్వయంగా తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ఈ ఫీచర్ ముందుగా న్యూజీలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్న యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మరికొన్ని దేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ సబ్స్క్రిప్షన్ పొందడానికి యూజార్ తనకి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడెంటిటీని సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ ప్రారంభ ధర నెలకు $11.99 ( Web) మరియు $14.99 ( iOS) గా ఉంటుంది అని మార్క్ తన పోస్ట్ లో తెలియజేసారు.
ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే… ట్విట్టర్ లో లాగా బ్లూ సబ్స్క్రిప్షన్ లో కేవలం బ్యాడ్జి మాత్రమే కాకుండా డైరెక్ట్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా మెటా తన యూజర్లకు అందిస్తుంది, తద్వారా అసలైన యూజర్లు తమ అకౌంట్లకు సంబంచి ఎవరైనా నకిలీ అకౌంట్లను క్రియేట్ చేస్తే నేరుగా మెటా కస్టమర్ కేర్ కి రిపోర్ట్ చేయవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ అనేది సరికొత్త పరిణామంగా చెప్పొచ్చు.
ఈ కొత్త ఫీచర్ అప్డేట్ (Meta Verified Subscription) పై మెటా వినియోగదారులు కామెంట్స్ రూపంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.