పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి భారతదేశంలోని అనేక నగరాలపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కమర్షియల్ ఎల్పీజీ (LPG Shortage in Hyderabad) సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
హోటళ్లకు కష్టాలు:
కమర్షియల్ LPG కొరత (Hyderabad LPG Shortage) కారణంగా హైదరాబాద్‌లో హోటళ్లు, హాస్టళ్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం కనిపిస్తోంది. హోటల్ యజమానుల ప్రకారం, ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గింది. రోజువారీ అవసరాలకు సరిపడా సిలిండర్లు అందకపోవడంతో వంట పనులు నిర్వహించడం కష్టంగా మారింది. ముఖ్యంగా చిన్న హోటళ్లు మరియు టిఫిన్ సెంటర్లు ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తోంది.
హాస్టళ్లలో మెనూ మార్పులు:
ఇకపోతే ఈ గ్యాస్ కొరత ప్రభావం నగరంలో హాస్టళ్లపైనా కూడా పడింది. ఈ మేరకు హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Hostels in Hyderabad IT Corridor Revises Menu Due To Shortage of Gas Cylinders. 🍱🔥 pic.twitter.com/wJpaS3PJBj
— Hi Hyderabad (@HiHyderabad) March 11, 2026
కమర్షియల్ సిలిండర్ల (LPG) సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడటంతో… హాస్టళ్లలో టీ, కాఫీలతో పాటు ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే చపాతీ, దోసెల వంటి వంటకాలను పరిమితం చేసి, తక్కువ గ్యాస్‌తో తయారయ్యే వంటకాలను మాత్రమే అందిస్తున్నట్లు సమాచారం.
అలాగే ఈ గ్యాస్ కొరత తీరే వరకు సెల్ఫ్ కుకింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అనుసరించాలని ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ పేర్కొంది.
బ్లాక్ మార్కెట్‌పై ఆరోపణలు:
మరోపక్క, కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని బ్లాక్ మార్కెట్‌లో ₹3000–₹4000 వరకు అమ్ముతున్నట్లు మీడియా సమాచారం. ఇది చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు పెద్ద భారంగా మారిందనే చెప్పాలి.
ఆహార ధరలు పెరిగే అవకాశం?:
ఈ సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే హోటళ్లలో ఆహార ధరలు పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హోటల్ యజమానులు మరియు హాస్టల్ నిర్వాహకులు గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నారు.
గ్యాస్ కొరత (LPG Shortage in Hyderabad):
The looming LPG shortage is beginning to hit restaurants in the city. Popular biryani – outlets like Shah Ghouse Restaurant and Pista House have turned to traditional wood-fire stoves to keep kitchens running.
While the commercial gas supply is uncertain, the auto-LPG supply was… pic.twitter.com/bv11ppGoxA— Ashish (@KP_Aashish) March 11, 2026
🚨 Hyderabad: LPG Supply Concerns
Hostels in the Gachibowli IT corridor have issued notices to residents about a possible LPG cylinder shortage, citing ongoing global tensions.
Some hostels say gas-intensive breakfast items like dosa, puri and chapathi may be limited, with… pic.twitter.com/hHSbfbVo0j
— Rathnam News (@RathnamNews) March 11, 2026
ALSO READ: రష్యా “Dead Hand” గురుంచి విన్నారా? ఇది ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందంటే…




