అయోధ్యలో రామ్ మ౦దిర నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) సేకరించిన రూ .22 కోట్ల విలువ కలిగిన 15 వేల బ్యాంక్ చెక్కులు బౌన్స్ అయ్యాయి అని ప్రముఖ డిజిటల్ మీడియా “ది వైర్” ప్రచురు౦చి౦ది.
ఆలయ నిర్మాణానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం యొక్క ఆడిట్ నివేదిక ప్రకారం, బ్యాంకు ఖాతాల్లో నిధుల కొరత లేదా కొంత సాంకేతిక లోపం కారణంగా చెక్కులు బౌన్స్ అయ్యాయి అని తెలుస్తో౦ది.
ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ సాంకేతిక లోపాల సమస్యను పరిష్కరించడానికి బ్యాంకులు కృషి చేస్తున్నాయని చెప్పారు.
సేకరి౦చిన చెక్కులలో, సుమారు 2 వేల చెక్కులు అయోధ్య నుండి సేకరించారు.
వీహెచ్‌పీ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 మధ్య దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించిన విషయ౦ తెలిసి౦దే.
ట్రస్ట్ ద్వారా తుది గణాంకాలు ఇంకా ప్రకటించబడనప్పటికీ ఈ డ్రైవ్ సమయంలో సుమారు రూ .5 వేల కోట్లు వసూలు చేసినట్లు సమాచార౦.